తమ్ముడి పెళ్లికి అన్న గుర్తుండిపోయే గిఫ్ట్... అదేంటో మీరే చూడండి!
Brother gift for younger brother wedding: హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ పాల వ్యాపరి మధు యాదవ్ తన తమ్ముడి మీద తనకున్న ప్రేమను ఎప్పటికీ గుర్తిండిపోయేలా ఏదైనా చేయాలనుకున్నాడు. తన తమ్ముడు చందు యాదవ్ పెళ్లి సందర్భంగా.. మరిచిపోలేని బహుమతి ఇచ్చి తన ప్రేమను చాటుకున్నాడు. హైదరాబాద్ నుంచి పూణే వరకు 'ప్రత్యేక హెలికాప్టర్'లో వరుడిని తీసుకువెళ్లి.. ఉగాది పండుగనాడు పూణేలో అదరహో అనిపించేలా వేడుకను నిర్వహించారు. 150 ఏళ్ల చరిత్ర గల దగ్దుసేత్ గణపతి ఆలయంపై 7 రౌండ్లలో హెలికాప్టర్ ద్వారా.. తన తమ్ముడితో పూల వర్షం కురిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. అంతేకాక వందల మంది కళాకారులతో సంస్కృతి సాంప్రదాయంలో తెలియజేసేలా.. మేళ, తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ భారత్ వేడుకను నిర్వహించారు. ఇలా మధు యాదవ్ తన తమ్ముడి పెళ్లి వేడుకల్లో భాగంగా.. హెలికాప్టర్‌తో తనదైన శైలిలో పెళ్లి కుమారుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఇలా వినూత్నంగా తమ్ముడి పెళ్లి నిర్వహించి మధు యాదవ్ అందరి దృష్టిని ఆకర్షించారు.