తెలంగాణ

telangana

dog

ETV Bharat / videos

ఎరక్కపోయి పోతే.. తల ఇరుక్కుపాయే

By

Published : Mar 25, 2023, 1:42 PM IST

ఎరక్కపోయి ఓ శునకం ప్లాస్టిక్ డబ్బాలో తల పెట్టింది. దీంతో అందులో దాని తల ఇరుక్కుపోయింది. ఈ క్రమంలో ఆ కుక్క నాలుగు రోజులుగా మూగ రోదన చేస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లిలో ఓ శునకం ఆహార అన్వేషణలో భాగంగా ప్లాస్టిక్ డబ్బాను చూసింది. అందులో ఆహారం ఉందేమోననే ఆశతో అందులో తలపెట్టగా.. అనుకోకుండా తల డబ్బాలో ఇరుక్కుపోయింది. దీంతో ఆ శునకం నాలుగు రోజులుగా ఆహారం, నీరు లేక దిక్కుతోచక తిరుగుతోంది.

ఈ విషయాన్ని గమనించిన కొందరు యువకులు.. కుక్క బాధను చూడలేక డబ్బాను తొలగించేందుకు ప్రయత్నించగా.. జనాల చప్పుడు విని భయంతో పారిపోతోంది. గ్రామ శివారులోని పంట పొలాల్లో తిరుగుతూ మూగ రోదన చేస్తోంది. ఈ క్రమంలోనే ఆహారం, నీరు లేక బక్క చిక్కిపోయింది. జంతు సంరక్షకులు ఎవరైనా వచ్చి శునకం తలకు ఉన్న ప్లాస్టిక్ డబ్బాను తొలగించి దానిని కాపాడాలని పలువురు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details