తెలంగాణ

telangana

A Dog Attacks on 4 year old girl

ETV Bharat / videos

నాలుగేళ్ల చిన్నారిపై పెంపుడు కుక్క దాడి.. భుజం, చేతులపై కాట్లు.. బెదిరించినా వదలకుండా.. - బెంగళూరు కుక్క న్యూస్

By

Published : Jun 29, 2023, 1:46 PM IST

నాలుగేళ్ల చిన్నారిపై దారుణంగా దాడి చేసింది ఓ పెంపుడు కుక్క. ఈ ఘటన కర్ణాటక బెంగళూరులోని కేఆర్​ పురాలో జరిగింది. తీవ్రంగా గాయపడిని చిన్నారి.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

ఇదీ జరిగింది
బసవన్​పుర్​ సమీపంలోని కృష్ణ సినిమా థియేటర్​ వద్ద నివసించే చంద్రశేఖర్​, షీలా దంపతులకు నాలుగేళ్ల చిన్నారి వినీషా ఉంది. బుధవారం ఉదయం 7.30 గంటల సమయంలో అదే వీధిలో ఉన్న తన స్నేహితురాలితో ఆడుకునేందుకు వినీషా వెళ్లింది. ఇదే సమయంలో ఆనంద్​ అనే వ్యక్తికి చెందిన పెంపుడు కుక్క జర్మన్ షెపర్డ్​ ఒక్కసారిగా చిన్నారిపై దాడి చేసింది. చిన్నారి అరుపులు విన్న స్థానికులు.. పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆమెను రక్షించేందుకు స్థానికులు కుక్కను బెదిరించినా.. వదలకుండా చిన్నారిని కరిచింది. వినీషా భుజం, చేతులపై దారుణంగా కరిచింది. దీంతో తీవ్ర గాయాలపాలైన చిన్నారిని.. సమీపంలోని కేఆర్ పురా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విక్టోరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారిపై కుక్క దాడి చేస్తున్న దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details