తెలంగాణ

telangana

A crane hung at a height of 15 feet in Ludhiana

By

Published : Jul 5, 2023, 10:46 AM IST

ETV Bharat / videos

15 అడుగులు గాల్లోకి లేచిన భారీ క్రేన్​.. దుకాణాలు, ట్రాక్టర్ ధ్వంసం

జనరేటర్​ను కిందకు దించేందుకు వచ్చిన భారీ క్రేన్ బోల్తా పడింది. ఈ సందర్భంగా క్రేన్.. సుమారు 15 అడుగులు గాల్లోకి లేచింది. ఈ ఘటన పంజాబ్​లోని లుధియానాలో జరిగింది. ఆ జనరేటర్​ కింద పడడం వల్ల ట్రాక్టర్​ సహా సమీపంలోని దుకాణాలన్నీ ధ్వంసమయ్యాయి.
ఇదీ జరిగింది
గోశాల రోడ్డులోని ఓ దుకాణంలో బాహుబలి జనరేటర్​​ను అమర్చేందుకు ఓ భారీ క్రేన్ వచ్చింది. ఈ క్రమంలోనే ట్రాక్టర్​లో ఉన్న జనరేటర్​ను.. కిందకు దించుతుండగా అదుపుతప్పి క్రేన్ బోల్తా పడింది. దీంతో క్రేన్​ 15 అడుగుల ఎత్తులోకి పైకి లేచింది. 

మరోవైపు, జనరేటర్​ పడడం వల్ల ట్రాక్టర్ పూర్తిగా ధ్వంసమైంది. క్రేన్ బోల్తా పడడం వల్ల సమీపంలోని అనేక దుకాణాలు, భవనాలు దెబ్బతిన్నాయి. పలువురికి గాయాలు కాగా.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వీధి చిన్నగా ఉండడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై అక్కడే ఉన్న క్రేన్ యజమానిని అడగగా.. ఆయన స్పందించలేదు. ఈ సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. సహాయక చర్యలు చేపట్టారు. బోల్తా పడిన క్రేన్​ను సరిచేసి రహదారిని పునరుద్ధరించారు.

ABOUT THE AUTHOR

...view details