Pratidwani : గవర్నర్ వర్సెస్ సర్కార్.. ఈ వివాదాలు తీరే దారేది? - నేటి ప్రతిధ్వని
Pratidwani: రాష్ట్రంలో ప్రభుత్వం.. గవర్నర్ వ్యవస్థ మధ్య నెలకొన్న కోల్డ్ వార్‌కు ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. గతంలో నెలకొన్న వాడీవేడీ వాతారణం కాస్త చల్లారింది అనుకునే లోపే.. పరిస్థితి మళ్లీ మొదటికి రావడమే అందుకు కారణం. బిల్లులు ఆమోదించడం లేదని ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తుంటే.. సుప్రీం కోర్టు కన్నా రాజ్‌భవన్ దగ్గర కదా అని తనదైన రీతిలో బదులిచ్చారు గవర్నర్ తమిళిసై. హైదరాబాద్‌లో ప్రధాని మోదీ వచ్చి వందే భారత్ రైలు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవ్వక పోవడం.. ఇటీవల సచివాలయం ప్రారంభ వేడుకలకు గవర్నర్ తమిళిసై పాల్గొన లేదు. అనంతరం ఇలాంటి పరిణామాలు జరుగుతూ వివాద తీవ్రతను అందరికీ అర్థమయ్యేలా చెబుతునే ఉన్నాయి. దీనిపై రాష్ట్ర మంత్రులూ తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో అసలు ఎందుకీ పరిస్థితి? రాజ్‌భవన్ - ప్రగతిభవన్ ఇరువైపుల నుంచి సఖ్యత దిశగా అడుగులు పడాలంటే ఏం చేయాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చ.