తెలంగాణ

telangana

రామాలయం చుట్టూ తిరుగుతున్న వివాదం.. ప్రశాంత పల్లెలో వర్గపోరు

ETV Bharat / videos

Clash Between 2 Groups in The Village : రామాలయం చుట్టూ తిరుగుతున్న వివాదం.. ప్రశాంత పల్లెలో వర్గపోరు - telangana latest news

By

Published : May 31, 2023, 4:12 PM IST

Clash Between 2 Groups in Karakkayala gudem Suryapet District : సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం కరక్కాయల గూడెంలో రామాలయ గుడి నిర్మాణంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. వందేళ్ల నాటి దేవాలయాన్ని కూల్చడానికి ఒప్పుకోమంటూ అదే గ్రామానికీ చెందిన ఒక వర్గం వారు నిరసన వ్యక్తం చేశారు. నూతన ఆలయాన్ని నిర్మించాలంటూ మరో వర్గం వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో గ్రామంలో ఇరువర్గాల మధ్య రెండు రోజుల క్రితం నుంచి తీవ్రస్థాయిలో ఘర్షణలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి గ్రామం ప్రశాంతంగా ఉన్నా.. ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ గ్రామస్థులు బిక్కుబిక్కుమంటున్నారు. గత ఆరు నెలల నుంచి రామాలయ నిర్మాణాన్ని చేపట్టాలని ప్రతిపాదించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ వాళ్లు దానికి మద్దతు తెలుపకపోవంతో పాటు గొడవకు దిగారని టీఆర్​ఎస్ వర్గం వాళ్లు ఆరోపించారు. ప్రజల సహకారంతో అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుని దేవాలయాన్ని నిర్మిద్దామని అనుకున్నాము. కానీ టీఆర్​ఎస్ వాళ్లు ఇప్పుడే నిర్మాణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం గుడిని కూల్చడానికి ప్రయత్నించారని కాంగ్రెస్ పార్టీ వర్గం తెలిపారు. ఈ నేపథ్యంలో రామాలయ నిర్మాణం చేయాలంటూ, వద్దంటూ ఇరు వర్గాలు ఘర్షణకు దిగారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details