బస్సును ఢీకొన్న కారు- ఒక్కసారిగా మంటలు- అందరూ సేఫ్! - బస్సును ఢీ కారుకు అంటుకున్న మంటలు
Published : Dec 4, 2023, 5:45 PM IST
A Car Collided With A Bus In Bangalore : కర్ణాటకలో ఓ బస్సు డ్రైవర్ అప్రమత్తత వల్ల పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో నలుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఓ కారు అతి వేగంగా వచ్చి బెంగళూరులోని నాగరబావి హోరావర్తుల రోడ్డులోని చంద్రలేఅవుట్ బస్టాండ్‌లో ఉన్న బీఎంటీసీ ప్రభుత్వ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ క్రమంలోనే కారుకు మంటలు అంటుకున్నాయి. కాసేపటికే అవి బస్సుకు కూడా వ్యాపించాయి.
అంతా సేఫ్..
ప్రమాదం జరిగిన వెంటనే కారులోని వ్యక్తులు సురక్షితంగా ప్రాణాలతో బయటకు దిగారు. మరోవైపు మంటలు బస్సుకు అంటుకోవడాన్ని గమనించిన డ్రైవర్ ప్రయాణికుల్ని అప్రమత్తం చేశారు. వెంటనే వారంతా కిందకు దిగేలా చూశారు. బస్సును కొంత దూరం తీసుకెళ్లి ఆపడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కారు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. బస్సు పాక్షికంగా దెబ్బతింది. ఈ ఘటనలో కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స కోసం అతడిని ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదానికి గురైన బస్సు యశ్వంత్‌పుర్ నుంచి నాయండహళ్లి వెళ్తుందని అధికారులు తెలిపారు.