ఫుట్‌పాత్‌పై నిల్చున్న వ్యక్తిని కోపంతో ఎత్తిపడేసిన ఎద్దు - ఫుట్‌పాత్‌పై నిల్చున్న వ్యక్తిపై దాడి చేసిన ఎద్దు
కర్ణాటకలో ఫుట్‌పాత్‌పై నిలబడి ఉన్న వ్యక్తిపై అకస్మాత్తుగా ఓ ఎద్దు దాడిచేసింది. ఒక్కసారిగా పైకి దూసుకొచ్చిన ఎద్దు అతడిని ఎత్తిపడేసింది. ఈ ఘటనలో బాధితుడికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు అక్కడికి చేరుకొని బాధితుడికి సాయం చేశారు. కర్ణాటకలో శివమొగ్గ జిల్లాలో తీర్థహళ్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST