A Boy Falls Off School Building In Nirmal : ప్రమాదవశాత్తు పాఠశాల భవనం రెండో అంతస్తు నుంచి పడిపోయిన విద్యార్థి.. - తెలంగాణ తాజా వార్తలు
Published : Sep 1, 2023, 2:00 PM IST
A Boy Falls Off School Building In Nirmal : నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్లో గల మేధ మోడల్ స్కూల్లో ప్రమాదవశాత్తు రెండో అంతస్తు నుంచి విద్యార్థి జారిపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామానికి చెందిన విద్యార్థి ఈశ్వర్ నిర్మల్లోని మేద మోడల్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. ఉదయం ఎప్పటిలాగే పాఠశాలకు వచ్చాడు. పాఠశాలలోని రెండో అంతస్తులో తరగతి ఉండగా తోటి విద్యార్థులతో కలిసి తరగతి గదికి వెళుతుండగా ప్రమాదవశాత్తు రెండో అంతస్తు నుంచి కిందికి జారిపడ్డాడు.
ఈ ఘటనలో దవడకు, కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. దీంతో అక్కడ పని చేస్తున్న పాఠశాల సిబ్బంది గమనించి హుటాహుటిన చికిత్స నిమిత్తం స్థానిక శ్రీ ఆదిత్య ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి తల్లి దండ్రులకు ఈ విషయం తెలియడంతో వారు కూడా హుటాహుటిన ఆస్పత్రికి చేరుకొన్నారు. విద్యార్థికి శస్త్ర చికిత్స చేశామని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.