Born with 24 Fingers: 24 వేళ్లతో పుట్టిన శిశువు.. ఆశ్చర్యంలో వైద్యులు - 24 fingers child video
A Boy Born with 24 Fingers: జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ శిశువు ఏకంగా 24 వేళ్లతో జన్మించి.. అందరిని ఆశ్చర్యానికి గురి చేెశాడు. నిజామాబాద్ జిల్లా ఎర్గట్లకు గ్రామానికి చెందిన రవళి మొదటి ప్రసవం కోసం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. సోమవారం తెల్లవారుజామున సాధారణ కాన్పు ద్వారా మగ శిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన మగ శిశువుకి చేతులు, కాళ్లను పరిశీలించగా.. నాలుగు చోట్ల ఆరు వేళ్లతో మొత్తం 24 వేళ్లు ఉండటాన్ని వైద్యులు గమనించారు. ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తల్లి, శిశువు క్షేమంగా ఉన్నారని వారు పేర్కొన్నారు. ఈ విధంగా శిశువు జన్మించడాన్ని వైద్యభాషలో 'పాలిడాక్టీయా' అంటారని తెలిపారు. ఇటువంటి కండిషన్ వల్ల ఒక్కోసారి గుండె సంబంధిత సమస్యలు, గుండెలో రంధ్రం ఉండేందుకు అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ఇరువురిని అబ్జర్వేషన్లో ఉంచినట్లు తెలిపారు.