Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టులో మరో ఘట్టం ఆవిష్కృతం - Kaleshwaram Project9th package trail run
Kaleswaram 9th package trial run successful : తెలంగాణ నీటి ప్రధాత.. ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రి.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో ఘట్టం ఆవిష్కృతమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట వద్ద తొమ్మిదో ప్యాకేజీ ట్రయల్ రన్ విజయవంతమైంది. మధ్యమానేరు నుంచి రగుడుకు.... అక్కడి నుంచి 12 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా తరలించిన జలాలను మల్కపేట రిజర్వాయర్ లోకి ఎత్తిపోసే ప్రక్రియకు ట్రయల్ రన్ నిర్వహించారు.
మల్కపేట నుంచి మైసమ్మ చెరువు..... గంభీరావుపేట మండలం సింగ సముద్రం నుంచి సెకండ్ స్టేజ్ పంప్ హౌజ్‌కు.... బత్తుల చెరువు మీదుగా అప్పర్ మానేరుకు నీటిని తరలించేలా 32.4 కిలోమీటర్ల మేర పనులు చేపట్టారు. గత ఏడాది వరదనీటితో మల్కపేట పంపులు మునిగిపోవడంతో తమిళనాడు నుంచి తీసుకువచ్చిన ప్రత్యేక మోటార్ల ద్వారా 45 రోజులపాటు నీటిని ఎత్తిపోశారు. ఆ తర్వాత మోటార్ల బిగింపు ప్రక్రియను ప్రారంభించారు. రూ.504 కోట్లతో నిర్మాణం చేపట్టిన ఈ ప్రాజెక్టును త్వరలో ప్రారంభించనున్నారు.