90 Sheeps Died in Nalgonda Accident Today : గొర్రెల మందపైకి దూసుకెళ్లిన టిప్పర్.. 90 మూగజీవాలు మృత్యువాత - నల్గొండ తాజా వార్తలు
Published : Oct 28, 2023, 6:34 PM IST
90 Sheeps Died in Nalgonda Accident Today :నల్గొండ జిల్లాలో ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. నాగార్జున్‌సాగర్ దెయ్యాలగంటి వద్ద గొర్రెల మందపైకి దూసుకెళ్లడంతో.. 90 మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. నాగార్జునసాగర్ నుంచి హాలియాకు వెళ్తున్న టిప్పర్.. అదుపుతప్పి ఎదురుగా వస్తున్న అంబులెన్స్‌ను ఢీకొని.. మాచర్ల నుంచి మిర్యాలగూడ వైపునకు వెళ్తున్న గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. అనంతరం అక్కడే ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టి నిలిచిపోయింది.
ఈ ఘటనలో బస్సులో ఉన్న ప్రయాణికులకు తృటిలో ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో గొర్రెలు టిప్పర్ కింద పడి నుజ్జు నుజ్జు అయ్యాయి. దాదాపు 90 గొర్రెలు మృత్యువాతపడగా.. కొన్ని గాయాల పాలయ్యాయి. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టిప్పర్ అతివేగం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు.. మూగజీవాలను కోల్పోయిన తమను ఆదుకోవాలంటూ బాధితులు వేడుకుంటున్నారు.