దిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. అబ్బురపరిచిన సైనిక విన్యాసాలు - దిల్లీలో ఘనంగా సైనిక కవాతు
దిల్లీలో 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో 17 రాష్ట్రాలు, 6 శాఖలకు చెందిన శకటాలు కర్తవ్యపథ్‌లో నిర్వహించిన కవాతులో పాల్గొన్నాయి. కర్తవ్యపథ్ పరేడ్‌లో భారత నౌకాదళం, వైమానిక దళం శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 861 బ్రహ్మోస్ రెజిమెంట్ డిటాచ్‌మెంట్ ఈ కవాతులో పాల్గొంది. ఒంటెలతో కూడిన బీఎస్‌ఎఫ్ బృందం ఆకట్టుకుంది.
ప్రధాన యుద్ధట్యాంక్ అర్జున్, నాగ్ క్షిపణి వ్యవస్థ, కే-9 వజ్రా-టీ గన్ సిస్టమ్, బ్రహ్మోస్ క్షిపణులు, బీఎంపీ 2 శరత్ పదాతిదళ పోరాట వాహనం, క్విక్ రియాక్షన్ ఫైటింగ్ హెవీ వెహికల్, పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రఫేల్, మిగ్-29, సుఖోయ్-30, సుఖోయ్-30 ఎమ్‌కెఐ జాగ్వార్, సి-130, సి-17, డోర్నియర్, డకోటా, ఎల్‌సిహెచ్ ప్రచంద్, అపాచీ వంటి యుద్ధ విమానాలు, హెలికాప్టర్‌లు గగనతలంలో గర్జించాయి. రిపబ్లిక్ డే ఫ్లై ఫాస్ట్‌లో మొత్తం 44 వాయుసేన విమానాలు విన్యాసాలు చేశాయి.