55 Feet Eco Friendly Durga Mata Idol in Hyderabad : ఇసామియా బజార్లో 55 అడుగుల ఎకో ఫ్రెండ్లీ దుర్గా మాత.. - దుర్గాపూజ పోస్టర్‌ను రామానుజ జీయర్ స్వామి విడుదల
Published : Oct 10, 2023, 2:30 PM IST
55 Feet Eco Friendly Durga Mata Idol in Hyderabad : ధర్మాన్ని కాపాడటంతో పాటు ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని.. త్రిదండి వేదాంత రామానుజ జీయర్ స్వామి అన్నారు. హైదరాబాద్ కోఠిలోని ఇసామియా బజార్లో శ్రీ దుర్గ నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో.. ప్రతి ఏడాది ప్రతిష్టించే అతి పెద్ద ఎకో ఫ్రెండ్లీ 55 అడుగుల దుర్గా మాత విగ్రహ రూపకల్పన పూజ, నవరాత్రి ఉత్సవాల రూప చిత్రం పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం రూపుదిద్దుకుంటున్న 55 అడుగుల దుర్గా మాత విగ్రహానికి స్వామిజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగాచెడుపై ఎల్లవేళలా మంచి విజయం సాధిస్తుందన్నారు. అమెరికా వంటి వర్ధమాన దేశాలు రూ.లక్షల కోట్లు ఖర్చు పెట్టినా సాధ్యం కాని చంద్రయాన్-3ని కేవలం రూ.600 కోట్లతో ధార్మికత కలిగిన భారతీయులు సాధించడం గొప్ప విషయమన్నారు. దసరాను ఘనంగా నిర్వహించుకోవడం పట్ల ఆధ్యాత్మికత మరింత వెల్లివిరుస్తుందన్నారు. ఖైరతాబాద్ వినాయకుడిని ఆదర్శంగా తీసుకొని.. గత 24 ఏళ్లుగా నవరాత్రి సమితి వ్యవస్థాపక నిర్వాహకులు గులాబ్ శ్రీనివాస్ నేతృత్వంలో అతి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని కొనియాడారు.
TAGGED:
Telangana Latest News