తెలంగాణ

telangana

50 Kgs Tortoise Found Viral Video

ETV Bharat / videos

50 Kgs Tortoise Found Viral Video : చెరువులో 50కిలోల​ తాబేలు.. తీసుకుని గ్రామస్థుల పరార్​.. ఏడేళ్ల జైలు శిక్ష? - చెరువులో 50 కిలోల తాబేలు లభ్యం

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2023, 1:28 PM IST

50 Kgs Tortoise Found Viral Video : ఆలయ చెరువులో 100 ఏళ్ల నాటి తాబేలు లభ్యమైంది. 50 కిలోలకుపైగా బరువు ఉన్న ఆ తాబేలును చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. మొబైల్​లో వీడియో తీసేందుకు పోటీపడ్డారు. ఇంతలో కొందరు గ్రామస్థులు.. ఆ తాబేలును తీసుకుని పరారయ్యారు. బిహార్​లోని బక్సర్​ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

అసలేమైందంటే?
జిల్లాలోని బ్రహ్మపుర్‌లో ఉన్న బాబా బ్రహ్మేశ్వరనాథ్ ఆలయ సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం.. రూ.8కోట్లకుపైగా నిధులు కేటాయించింది. అందులో భాగంగా గత ఆరు నెలలుగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇటీవలే ఆలయ చెరువులోని పాత నీటిని తోడి కొత్త నీటిని నింపే ప్రక్రియను ప్రారంభించారు. ఆ సమయంలో భారీ తాబేలుతోపాటు చేపలు లభ్యమయ్యాయి. దీంతో వాటిని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. మొబైల్​లో వీడియోలో తీసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు.

ఆ తర్వాత పలువురు గ్రామస్థులు.. తువ్వాలులో భారీ తాబేలును వేసుకుని పరారయ్యారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్​ కావడం వల్ల అటవీ శాఖ అధికారుల దృష్టికి చేరింది. దీంతో వారు తాబేలు కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. వన్య ప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం.. తాబేళ్లు సహా పలు జంతువులను పట్టుకోవడం, విక్రయించడం, తినడం చట్టరీత్యానేరమని నిపుణులు చెబుతున్నారు. వారికి ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details