5 Year Old Boy Hanuman Chalisa Record : హనుమాన్ చాలీసా చదివి బాలుడి రికార్డ్.. రాష్ట్రపతి నుంచి ఆహ్వానం - హనుమాన్ చాలీసా బాలుడి రికార్డ్
Published : Aug 29, 2023, 4:44 PM IST
5 Year Old Boy Hanuman Chalisa Record: పంజాబ్ భటిండాకు చెందిన ఐదేళ్ల చిన్నారి వేగంగా హనుమాన్ చాలీసా పఠించడంలో రికార్డు సాధించాడు. గీతాన్స్ గోయల్ అనే బాలుడు ఒక నిమిషం 54 సెకన్ల సమయంలో హనుమాన్ చాలీసా పఠించాడు. ఇందుకుగాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు సంపాదించాడు. నాలుగేళ్ల 3 నెలల వయసులోనే వేగంగా హనుమాన్ చాలీసా పఠించినట్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ధ్రువీకరించింది. వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ యూనివర్శిటీ సైతం ఇదే విషయం నిర్ధరిస్తూ ధ్రువీకరణ పత్రం ఇచ్చింది. అతి చిన్నవయసులోనే అద్భుత రికార్డులను సాధించిన గీతాన్స్‌కు రాష్ట్రపతి భవన్ నుంచి పిలుపు వచ్చింది. గీతాన్స్ రక్షాబంధన్ సందర్భంగా ఆగస్టు 30న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నట్లు అతడి తండ్రి డాక్టర్ విపిన్ గోయల్ తెలిపారు. రాష్ట్రపతి వద్ద నుంచి ఆహ్వానం రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. "ద్రౌపది ముర్మును కలవాలని మాకు రాష్ట్రపతి భవన్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మా కుమారుడు రాష్ట్రపతిని కలవడం చాలా సంతోషంగా ఉంది, ఇది మాకు గర్వకారణం" అని చెప్పారు విపిన్.