తెలంగాణ

telangana

Minister Indrakaran Reddy in 4k Walking in Vanasthalipuram

ETV Bharat / videos

Minister Indrakaran Reddy in 4k Walking in Vanasthalipuram : 'ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజు నడక తప్పనిసరి' - 4కే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్

By ETV Bharat Telangana Team

Published : Sep 10, 2023, 11:44 AM IST

Minister Indrakaran Reddy in 4k Walking in Vanasthalipuram: వనస్థలిపురంలోని హరిన వనస్థలి పార్క్​లో మహావీర్ హరిత వనస్థలి డీర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 4k వాక్ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి, ఎమ్మెల్యే దేవీ రెడ్డి సుధీర్ రెడ్డి... జెండా ఊపి ప్రారంభించారు. 4k వాకింగ్​లో  గెలుపొందిన విజేతలకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ నిత్యం ఆక్సిజన్ లభించే ఇలాంటి పార్క్​లలో వాకింగ్ చేస్తూ వారి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలన్నారు. వనస్థలిపురంలో ఉన్న పార్కులను రక్షించుకుంటూ మరిన్ని కొత్త వాకింగ్ ట్రాక్​లను తీసుకురావలసిన అవసరం ఉందని తెలిపారు. ఈ ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతాలను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నగరంలో ఎక్కువ వాహనాలు, సౌండ్ పొల్యూషన్ ఉండడం వల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృతంలో నగరంలో అనేక అర్బన్ పార్కులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పచ్చదనం 7.7శాతం పెరిగిందని తెలిపారు. పచ్చదనం పెంచేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. నగరంలో మరో 25 పార్కులు రావాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలన్నారు. వాకర్స్​ ఈ పార్కులను సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు. చిన్నతనం నుండే వాకింగ్ అలవాటు చేసుకోవాలన్నారు. ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని, అటవీశాఖ అధికారులను, వాకర్స్ అసోసియేషన్ సభ్యులను మంత్రి  అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details