తెలంగాణ

telangana

38KGs Big fish

ETV Bharat / videos

తెలంగాణ సరిహద్దులో చిక్కిన భారీ చేప.. ఎన్ని కేజీలో తెలిస్తే షాక్..! - మత్స్యకారులకు చిక్కిన అరుదైన మీనం

By

Published : Mar 29, 2023, 2:28 PM IST

Big fish Caught in Pranahita River in Bhupalpally : తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిరోంచ వద్ద ప్రాణహిత నదిలో భారీ చేప లభించింది. రోజూ మాదిరి వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఓ అరుదైన మీనం దొరికింది. సాధారణంగా నదిలో పది నుంచి పదిహేను కిలోల చేపలు దొరకడం మనం చూస్తుంటాం. కానీ ఇవాళ ప్రాణహిత నదిలో మత్స్యకారుల వలకు ఏకంగా 38 కిలోల భారీ చేప చిక్కింది. చేపను మార్కెట్​కు తరలించగా ప్రజలు ఆసక్తిగా తిలకించారు. 'చీకు మట్ట' అని పిలిచే ఈ చేప అరుదైనదని స్థానిక మత్స్యకారులు తెలిపారు.

సముద్రంలో ఎక్కువగా ఉంటుందని.. ఎదురీదుతూ ఇక్కడి వరకు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ఈ విషయంపై మహదేవపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంతుశాస్త్ర అధ్యాపకుడు పి. రాజు పలు విషయాలు వెల్లడించారు. సముద్ర తిమింగాలాల్లో ఉపజాతికి చెందినదని, నీలి తిమింగలమని ఆయన పేర్కొన్నారు. బూడిద, నీలి వర్ణంలో ఉంటుందని చెప్పారు. చిన్న చేపల్ని తింటుందని ఆయన వివరించారు. ఇలాంటివి అరుదుగా దొరుకుతాయని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details