350kg Fish Viral Video : జాలర్లకు చిక్కిన 350కిలోల 'మురు' చేప.. వీడియో చూశారా? - కర్ణాటక భారీ చేప వీడియో
Published : Sep 30, 2023, 7:05 AM IST
|Updated : Sep 30, 2023, 10:12 AM IST
350kg Fish Viral Video : చేపల వేటకు వెళ్లిన మత్య్సకారులకు పంట పండింది! జాలర్ల వలలో 350 కిలోల భారీ 'మురు' చేప చిక్కింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సంఘటన కర్ణాటకలోని మంగళూరులో జరిగింది.
మంగళూరులోని ఫిషింగ్ పోర్టు నుంచి కొందరు మత్స్యకారులు.. చేపల వేట కోసం సముద్రానికి శుక్రవారం వెళ్లారు. చేపలను పట్టుకునేందుకు పెద్ద సైజు వలను విసిరారు. అదే సమయంలో భారీ మురు చేప చిక్కింది. సుమారు 350 కిలోల బరువు ఉన్న ఆ చేపను పడవలో వేసేందుకు మత్య్సకారులు ఇబ్బంది పడుతున్నట్లు వీడియోలో చూడొచ్చు.
సాధారణంగా ఈ మురు చేపలు చిన్న సైజులో మార్కెట్లో లభిస్తాయి. ఒక్కో చేప 250 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు ఉంటుంది. కానీ ఇంత పెద్ద సైజులో ఉన్న మురు చేపలను చూడటం అరుదు. ఈ మురు చేపలను కిలో రూ.100 నుంచి రూ.200 వరకు విక్రయిస్తున్నారు.