సొరంగంలో అదుపు తప్పి గోడను ఢీకొన్న బైక్ వీడియో వైరల్ - himachal motor cycle accident
హిమాచల్ ప్రదేశ్ మనాలీలోని అటల్ టనెల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి గోడను ఢీ కొట్టింది. గాయపడ్డ ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని పెఖ్డీ బంజర్‌కు చెందిన నిషు ఠాకూర్, కులుకు చెందిన గీతాంశ్ బాబుగా గుర్తించారు. సొరంగంలో అమర్చిన సీసీటీవీలో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST