రెచ్చిపోయిన దొంగలు.. యువకుడి గొంతు నులిమి.. సెల్‌ఫోన్, నగదు చోరీ! - గురుగ్రామ్ దొంగతనం వార్తలు
Gurugram robbery CCTV video: హరియాణాలో దొంగలు రెచ్చిపోయారు. గురుగ్రామ్‌లో ఓ వ్యక్తిని అడ్డగించి డబ్బు, సెల్‌ఫోన్ చోరీ చేశారు. మే 11న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉదయం ఆరున్నర గంటల సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువకుడిని.. ఓ దొంగ వెనక నుంచి వచ్చి అడ్డగించాడు. గొంతును గట్టిగా పట్టేశాడు. అతడితో పాటు వచ్చిన మరో దొంగ.. యువకుడి జేబులో నుంచి డబ్బు, సెల్‌ఫోన్ దొంగలించాడు. అనంతరం ఇద్దరు దొంగలు అక్కడి నుంచి పరార్ అయ్యారు. మొత్తం రూ.7900 చోరీ అయ్యాయని బాధితుడు చెప్పాడు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరిది బిహార్ కాగా.. మరొకరిది ఝార్ఖండ్ అని తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST