odisha train accident: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 178 ఏపీ ప్రయాణికులు.. వివరాలు సేకరిస్తున్నాం: వాల్తేరు డీఆర్‌ఎం - కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ సమాచారం
coromandel express train accident: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 178 ఏపీ వాసులు ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటనలో ఏపీకి చెందిన ప్రయాణికుల వివరాల కోసం రాష్ట్ర విపత్తు నిర్వహణా సంస్థలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఒడిశాలో రైలు ప్రమాదం దృష్ట్యా పలు రైళ్లు రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. అలాగే రైలు ప్రమాదం దృష్ట్యా పలుచోట్ల హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు.
కోరమాండల్‌లో 178 మంది ఏపీ ప్రయాణికులు ఉన్నారని వాల్తేరు డీఆర్‌ఎం వెల్లడించారు. సుమారు వందమందికి పైగా విశాఖకు రిజర్వేషన్ చేయించుకున్నట్లు డీఆర్‌ఎం పేర్కొన్నాడు. జనరల్ బోగీలో ఎందరు ఏపీ ప్రయాణికులున్నారో తెలియాల్సి ఉందని డీఆర్‌ఎం వెల్లడించారు. బాలాసోర్ నుంచి ప్రత్యేక రైలు మరో 2 గంటల్లో విశాఖ రానుందని డీఆర్‌ఎం తెలిపాడు. విశాఖ నుంచి మరమ్మతు సిబ్బందితో ఒక రైలు బాలాసోర్ వెళ్తోందని వాల్తేరు డీఆర్‌ఎం వెల్లడించారు. యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఎందరు ఏపీ వాసులున్నారో తేలాల్సి ఉందని డీఆర్‌ఎం పేర్కొన్నారు.