తెలంగాణ

telangana

Buffaloes Washed away in Bhimeswara Vagu

ETV Bharat / videos

100 Cattle Washed Away in Stream Kamareddy : ఒక్కసారిగా ఉప్పొంగిన వాగు.. వరదలో కొట్టుకుపోయిన 100 పశువులు.. వీడియో వైరల్ - భీమేశ్వర వాగులో గేదెల ప్రమాదం

By ETV Bharat Telangana Team

Published : Sep 29, 2023, 10:21 AM IST

100 Cattle Washed Away in Stream Kamareddy  : కామారెడ్డి​ జిల్లాలోని తాడ్వాయి మండలం సంతాయిపేట భీమేశ్వర వాగు(Bhimeshwara Vagu) ఎగువ నుంచి వస్తున్న వరదతో ఒక్కసారిగా ఉప్పొంగింది. ఈ ఘటనలో సుమారు 200 గేదెలు కొట్టుకుపోయాయి. వాటిలో 100 గేదెలను స్థానికులు కాపాడారు. మరికొన్ని వరదలో గల్లంతయ్యాయి. వాటి కోసం గ్రామస్థులు గాలిస్తున్నారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..జిల్లాలో కురిసిన వర్షానికి.. ఎగువ నుంచి వస్తున్న వరదకు భీమేశ్వర వాగు ఉప్పొంగి ప్రవహించింది. వాగు ప్రవహించే ప్రాంతాలైనా.. సంతాయిపేట, చిట్యాల గ్రామాల పరిధిలో గురువారం రోజున వర్షం లేనందున పశువుల కాపరులు వాగు దాటి పశువులను మేత కోసం తీసుకువెళ్లారు. సాయంకాలం తిరిగి ఇంటికి తీసుకువస్తున్న సమయంలో ఒక్కసారిగా వాగు ఉప్పొంగింది. ఆ సమయంలో వాగులో 200 పశువులు ఉన్నాయి.

వరద ఉద్ధృతికి 100 పశువులు కొట్టుకుపోయాయి. మరో 100 పశువులు ఈదుకుంటూ, రాళ్ల మధ్యన చిక్కుకొని గాయాలతో ప్రాణాలు కాపాడుకున్నాయి. మిగిలిన వాటి కోసం రైతులు వెతికే ప్రయత్నాలు చేస్తున్నారు. దొరికిన పశువులు దొరికినట్లు ఒడ్డుకు చేరుస్తున్నారు. సంతాయిపేట పరిసర ప్రాంతాల్లో వర్షం లేకపోవడంతోనే వాగు ప్రవహించే తీరును పశువుల కాపరులు గ్రహించలేకపోయారని స్థానికులు చెబుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details