బర్త్‌డే వేడుకల్లో 10 కేజీల మహాబాహుబలి సమోసా కటింగ్ - ఉత్తర్‌ప్రదేశ్ మేరఠ్ న్యూస్
పుట్టిన రోజు వేడుకల్లో కేక్‌లు కట్ చేయడం చూస్తుంటాం. అయితే ఉత్తర్‌ప్రదేశ్ మేరఠ్‌లో మాత్రం ఓ వ్యక్తి తన పుట్టినరోజున ఏకంగా 10 కేజీల మహాబాహుబలి సమోసాను కట్ చేశాడు. ఈ సమోసా తయారీకి రూ.1500 ఖర్చు అయ్యిందని వ్యాపారి శుభమ్ కౌశల్ తెలిపాడు. అలాగే 6 గంటల సమయం పట్టిందని చెప్పాడు. ఈ 10 కేజీల బాహుబలి సమోసాను తిన్నవారికి రూ.71 వేల నగదు బహుమతిని ఇస్తానని అంటున్నాడు శుభమ్ కౌశల్.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST