వృద్ధుడిని మోస్తూ మంచులో 16.కి.మీ సాహస యాత్ర - ఉత్తరాఖండ్ మంచులో 16 కిమీ నడక
భారీ హిమపాతం మధ్య అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని సుమారు 16 కి.మీ మేర మోసుకువచ్చారు గ్రామస్థులు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీలో జరిగింది. ఓస్లా గ్రామానికి చెందిన కృపా సింగ్ అనే వ్యక్తి ఆరోగ్యం విషమించింది. దీంతో ఆయన్ను గ్రామంలోని యువకులు కర్రలకు కట్టుకుని రహదారి వరకు తమ భుజాలపై మోసుకువెళ్లారు. కొన్ని ప్రాణాంతమైన ప్రదేశాల్లో కూడా ఒకరినొకరు పట్టుకుని రోడ్డువరకు తీసుకెళ్లారు. అనంతరం సమీపంలో ఉన్న పురోలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్చి, వైద్యం చేయించారు.
Last Updated : Feb 3, 2023, 8:16 PM IST