నిద్ర మత్తులో డ్రైవర్.. రూ.కోటి విలువైన మద్యం బుగ్గి - విస్కీ బాటిళ్లు తీస్కెళ్తుండగా ప్రమాదం
Liquor Laden Truck Fire: హరియాణా కర్నాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. తరావడీ-శామ్‌గఢ్ జాతీయ రహదారిపై రెండు ట్రక్కులు ఢీకొనగా.. మంటలు చెలరేగాయి. ట్రక్కులు పూర్తిగా దగ్ధమయ్యాయి. కోటి రూపాయలకుపైగా విలువైన మద్యం పూర్తిగా కాలిపోయింది. నలాగఢ్ నుంచి దిల్లీకి ఒక ట్రక్కులో విస్కీని తరలిస్తున్నారు. శామ్‌గఢ్ సమీపంలో మరో ట్రక్కు తొలుత డివైడర్‌ను ఢీకొట్టి ఆగగా.. మద్యం లోడ్‌తో వెనుకనుంచి వచ్చిన ట్రక్కు కూడా నియంత్రణ కోల్పోయి దానికి తగిలింది. అంతే ఒక్కసారిగా మంటలు చెలరేగి కాలి బూడిదయ్యాయి. ట్రక్కు డ్రైవర్ నిద్ర పోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST