సింహాల వాలంటైన్స్ డే.. గిఫ్ట్‌లు ఏమిచ్చారంటే? - లండన్ సింహాలకు ప్రేమికుల రోజు
lions valentines day: లండన్‌లోని లయన్ జూ వాలంటైన్స్ డే వేడుకను నిర్వహించింది. జూ నిర్వాహకులు ఆసియా సింహాల జంటకు ప్రేమికుల రోజు సందర్భంగా ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. ఐరా, భాను అనే రెండు సింహాలకు హృదయాకారంల్లో ఉన్న గిఫ్ట్ బాక్స్‌లలో వాటికి ఇష్టమైన ఆహారాన్ని అందజేశారు. ఈ ఆహారాన్ని ఆరగించేందుకు.. సింహాలు ఒకే చోటకు చేరాయి. ఆ ఆహారాన్ని రుచిని ఆస్వాదిస్తూ ప్రేమికుల రోజు జరుపుకున్నాయి. ఆహారం పూర్తి చేసిన అనంతరం తమకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుహలోకి వెళ్లి సేదతీరాయి.
Last Updated : Feb 3, 2023, 8:12 PM IST