వ్యర్థాలే వస్త్రాలైతే.. - స్పెక్ట్రమ్-2020 ఫెస్టివల్
హైదరాబాద్ మాదాపూర్‌లోని నిఫ్ట్ కళాశాలలో నిర్వహించిన స్పెక్ట్రమ్-2020 ఫెస్టివల్ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంది. మూడు రోజుల పాటు నిర్వహిస్తోన్న ఈ వేడుకలు రెండో రోజు వస్త్ర ప్రియుల్ని కట్టిపడేశాయి. తమ సృజనాత్మకతతో.. వ్యర్థాలను సైతం అందమైన వస్త్రాలుగా తీర్చిదిద్దివచ్చని మరోమారు నిరూపించారు విద్యార్థులు. నూతన సృజనాత్మకతతో శభాష్ అనిపించారు.