ఆకట్టుకుంటున్న కలశా జ్యూయలరీ ఉగాది కలెక్షన్ - హైదరాబాద్
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కలశా జ్యూయలరీ రెండో వార్షికోత్సవం ఘనంగా జరిగింది. సీనియర్ ఐపీఎస్ అధికారి షికా గోయల్, సినీ వర్ధమాన కథానాయిక సిద్ధి ఇద్నాని, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. చీరకట్టులో షికా గోయల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నగరానికి చెందిన మోడల్స్ ఆభరణాలను ధరించి ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌తో మెరిశారు.