తెలంగాణ

telangana

ETV Bharat / videos

పనికిరాని వస్తువులతో ఆకట్టుకునే ఉత్పత్తులు - INTERIOR

By

Published : May 26, 2019, 10:56 AM IST

సృజనాత్మకత ఉంటే చాలు వ్యర్థాలతోనూ అందమైన గృహాలంకరణ వస్తువులను తయారు చేయొచ్చని నిరూపిస్తున్నారు హోమ్‌టెక్‌ ఇంటీరియర్‌ విద్యార్థులు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఎన్‌ కన్వన్షన్‌ సెంటర్‌లో ఇంటీరియర్‌ ఉత్పత్తుల ప్రదర్శన జరుగుతోంది. 'ఇంటిరీ యువర్ షో' పేరుతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో విద్యార్థులు రూపొందించిన పలు రకాలైన డిజైన్లు వీక్షకులను ఎంతగానో ఆకర్షించాయి. ఇందులో పనికిరాని డ్రమ్స్, పాడైపోయిన ట్రాక్టర్ విడిభాగాలతో బార్ కౌంటర్స్, సోఫా సెట్స్, విభిన్న రకాల విద్యుద్దీపాలు... ఇలా ఎన్నో రకాలుగా వస్తువులు రూపొందించి ఔరా అనిపించారు. దాదాపు 450 విద్యార్థులు 600కు పైగా వస్తువులను ఇందులో ప్రదర్శించారు.

ABOUT THE AUTHOR

...view details