బస్సుపై గజరాజు 'ఎటాక్'- మూడుసార్లు పల్టీ కొట్టిన కారు! - pune car accident news
Kerala elephant news: కేరళలో ఓ అడవి ఏనుగు ప్రయాణికులను హడలెత్తించింది. రోడ్డుపై అడ్డంగా నిలబడి అటువైపుగా వచ్చిన బస్సుకు అతి దగ్గరగా వెళ్లింది. తొండంతో అద్దాన్ని తాకింది. దీంతో అద్దం పాక్షికంగా ధ్వంసమైంది. అయితే డ్రైవర్ ఏ మాత్రం బెదరకుండా చాకచక్యంగా వ్యవహరించాడు. కాసేపయ్యాక ఏనుగు అడ్డు తప్పుకోగానే అక్కడి నుంచి బస్సును వేగంగా ముందుకు నడిపాడు. ఈ ఏనుగును స్థానికులు పాదయప్ప అని పిలుస్తుంటారు. మహారాష్ట్ర పుణెలో జరిగిన మరో ఘటనలో వేగంగా వెళ్తున్న కారు మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. మూడు సార్లు పల్టీలు కొట్టింది. అదృష్టవశాత్తూ కారులో ఉన్నవారంతా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST