తెలంగాణ

telangana

ETV Bharat / videos

కన్నబిడ్డపై తల్లి కర్కశత్వం.. ఛాతిపై బాది.. నేలకేసి కొట్టి.. - కన్నబిడ్డను హింసించిన తల్లి

By

Published : Apr 12, 2022, 12:57 PM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

కన్నబిడ్డతో కర్కశంగా ప్రవర్తించింది ఓ తల్లి. కనికరం లేకుండా పసిబిడ్డను తీవ్రంగా హింసించింది. చిన్నారి గుక్కపట్టి ఏడుస్తున్నప్పటికీ.. ఆ మహిళ కొట్టడం ఆపలేదు. ఛాతిపై బలంగా కొడుతూ కింద పడేసింది. అమ్మతనానికి మచ్చతెచ్చే ఈ ఘటన జమ్ము కశ్మీర్​లోని సాంబ జిల్లాలో జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి.. మహిళను అరెస్టు చేశారు. ఆమెను ప్రీతి శర్మగా గుర్తించారు. ఆమె.. కామిలా పుర్​మండల్​కు చెందిన మాన్ సింగ్ భార్య అని పోలీసులు తెలిపారు. మహిళ మానసిక పరిస్థితి ఎలా ఉందనే సమాచారం లేదు. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details