జోరుగా హిమపాతం- మూతపడిన కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలు - us winter storm today
Winter Storm USA: అమెరికా తూర్పు తీరాన్ని హిమపాతం వణికిస్తోంది. న్యూయార్క్, ఓహియో, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో అడుగుల మేర మంచుదుప్పటి పరుచుకుంది. ఎక్కడ చూసినా మంచు మాత్రమే కనిపిస్తోంది. మసాచుసెట్స్, కనెక్టికట్, రోడ్ ఐలాండ్‌లను మంచు వర్షం భయపెడుతోంది. హిమపాతం ప్రభావిత ప్రాంతాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలు, పరీక్షా కేంద్రాలు మూతపడ్డాయి. జనజీవనం దాదాపు స్తంభించింది. నార్త్ కరోలినాలోని రాలే నగరంలో మంచు కారణంగా కార్లు రోడ్లపై జారిపోతున్నాయి. కొంచెం వేగంగా వెళ్లినా వాహనాలను అదుపుచేయడం చోదకులకు కష్టమైపోతోంది. రహదారులపై మంచు తొలగిస్తున్నప్పటికీ హిమపాతం కారణంగా మళ్లీ పేరుకుపోతోంది.