రెక్కల దుస్తుల్లో 'పక్షి రాజా'ల్లా ఎగిరిపోయారు - Wingsuit flying at yuhu peak china
సుమారు 990 మీటర్ల ఎత్తులో పక్షుల్లా ఎగిరిపోతున్న వీరంతా వింగ్ సూట్ ఫ్లయింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్ గెలవడానికి పోటీపడుతున్నారు. పక్షి రెక్కలలాంటి దుస్తులు ధరించి గంటకు 160 కి.మీ వేగంతో దూసుకుపోయారు. చైనా హునాన్ రాష్ట్రం జంగ్జియాజి నగరంలోని యూహూ పర్వతం వద్ద జరిగిన ఈ పోటీల్లో 11 దేశాలకు చెందిన విహంగహరాయుళ్లు పాల్గొంటున్నారు. ఆదివారం తుది విజేతను ప్రకటించనున్నారు.