తెలంగాణ

telangana

ETV Bharat / videos

కార్చిచ్చు బీభత్సం.. 10వేల ఎకరాలు దగ్ధం - అడవిలో కార్చిచ్చు

By

Published : Jul 1, 2021, 6:52 PM IST

అమెరికాలోని పలు ప్రాంతాల్లో దావానంల కల్లోలం సృష్టిస్తోంది. ఒరెగాన్​లో కార్చిచ్చు ధాటికి పదివేల ఎకరాల అటవీ భూమి దగ్ధం అయింది. 12 అగ్నిమాపక శకటాలు, 40 మంది సిబ్బందితో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. కార్చిచ్చు నేపథ్యంలో ఒరెగాన్​ రాష్ట్ర గవర్నర్​.. అత్యవసర స్థితిని ప్రకటించారు. మరోవైపు.. ఉత్తర కాలిఫోర్నియాలోనూ దావానలం విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే 27 చదరపు కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించాయి. ఓ అగ్నిపర్వతం బద్ధలవ్వగా ఈ మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. అగ్నికీలల ధాటికి ఆయా ప్రాంతాల్లోని వన్యప్రాణులు దహనమవుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details