కరోనా చికిత్స కోసం ఆసుపత్రిగా మారిన లాడ్జి
అమెరికాలోనూ కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో వైరస్ బాధితులకు చికిత్స అందించేందుకు వాషింగ్టన్లో ఓ లాడ్జిని కొనుగోలు చేసింది ప్రభుత్వం. ఇందులో 85 పడకలు ఉంటాయి. ప్రతి గదిలో వేడిని నియంత్రించే విధంగా పరికరాలు, వెంటిలేషన్, గాలి వెలుతురు వచ్చేలా ఏర్పాటు చేశారు. కరోనాతో అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 11మంది ప్రాణాలు విడిచారు.