సముద్రాల పరిరక్షణకు అవగాహన కార్యక్రమం - ప్రపంచ సముద్ర
'ప్రపంచ సముద్ర దినోత్సవం' సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే గ్రీన్ పీస్ సంస్థ సభ్యులు ఇటలీలోని టిరానియన్ సముద్ర తీరం వెంట వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. హృదయాకారంలో నిల్చొని సముద్రాలను కాపాడాలని పిలుపునిచ్చారు. సముద్రాన్ని ప్రతిబింబించేలా నీలిరంగు దుస్తులు, ముఖం, చేతులపై అదే రంగు పెయింట్‌ను వేయించుకుని అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా 23 దేశాల్లో గ్రీన్ పీస్ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.