నిప్పులు చిమ్ముతున్న అగ్నిపర్వతం- ఎన్నడూ లేనంత యాక్టివ్గా.. - cumbre vieja volcano upsc
స్పెయిన్ లా పల్మాలోని కంబర్ వీజా అగ్నిపర్వతం (Cumbre Vieja Volcano) గతంలో ఎన్నడూ లేనంత క్రియాశీలంగా ఉందని అధికారులు తెలిపారు. అగ్నిపర్వతం నుంచి భారీ స్థాయిలో లావా బయటకు వస్తోందని చెప్పారు. ఇప్పటికే లావా సముద్రంలో కలుస్తుండగా.. భారీ స్థాయిలో బూడిదను అగ్నిపర్వతం (Spain Volcano Eruption) గాల్లోకి వెదజల్లుతోంది. అగ్నిపర్వతం విస్పోటానికి ఇప్పటివరకు రెండు వేలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. 2,200 ఎకరాల్లో లావా ప్రవహించగా.. ఇక్కడి పంటలన్నీ దగ్ధమయ్యాయి. సుమారు 7,500 మంది స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు.