పాక్ 'విషాద'యానం: మృతదేహాల కోసం ఇంకా వెతుకులాట! - pak flight accident
పాక్లో విమాన ప్రమాదం జరిగి నాలుగు రోజులవుతున్నా.. ఇంకా మృతదేహాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. శిథిలాలను క్రేన్లతో తొలగిస్తూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు. ప్రజల నివాస ప్రాంతంలో విమానం కూలిపోవడం వల్ల ఇళ్లు పైకప్పులు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాటి కింద ఎంత మంది స్థానికులు చనిపోయారన్న దానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఈ దుర్ఘటనలో విమాన ప్రయాణికులు 97 మంది మృతి చెందగా.. ఇద్దరు మాత్రమే క్షేమంగా బయటపడ్డారు.