గాల్లో ఉండగానే విమానంలో మంటలు- తృటిలో తప్పిన ముప్పు - ఫిలిప్పీన్స్ బోయింగ్ 777లో మంటలు
ఫిలిప్పీన్స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777 విమానం తృటిలో భారీ ప్రమాదం నుంచి తప్పించుకుంది. లాస్ ఏంజెల్స్ నుంచి మనీలాకు బయలుదేరిన కొద్దిసేపటికే ఇంజన్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పైలట్లు... చాకచక్యంగా లాస్ ఏంజెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అప్పటికే మంటలు ఆరిపోవడం వల్ల 342 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.
Last Updated : Nov 22, 2019, 12:55 PM IST