ఈదురు గాలుల వేగానికి నిలవని భారీ ట్రక్కు - america truck swaying
భీకర గాలులు ఎంత ప్రభావవంతంగా ఉంటాయనే విషయం ఈ వీడియో స్పష్టం చేస్తోంది. అమెరికా కొలరాడో, వ్యోమింగ్‌లోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి వాతావరణ మార్పుల కారణంగా ఈదురు గాలులు వీస్తున్నాయి. గంటకు 112 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈ గాలులతో భారీ ట్రక్కులు సైతం అదుపుతప్పి పక్కకు జరిగిపోతున్నాయి. కొలరాడోలోని 25వ నెంబర్ ఇంటర్‌స్టేట్ రహదారిపై తాజాగా ఓ ఘటన చోటుచేసుకుంది. బలంగా వీస్తోన్న గాలి ధాటికి భారీ ట్రక్కు ఊగిసలాడుతూ ప్రయాణించింది. రోడ్లపై ప్రయాణాలు చేపట్టాలంటే భయపడుతున్నారు వాహనదారులు.