అమెరికాను వణికిస్తున్న వడగళ్ల తుపాను - US-Tornado
బీభత్సమైన సుడిగాలులు, వడగళ్లతో కూడిన తుపాను అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. రెడ్‌వుడ్, బ్రౌన్, వాటన్వాన్ జిల్లాల్లో భారీ ఆస్తినష్టం మిగిల్చింది. పరిశ్రమలతో పాటు నివాసాల పైకప్పులు భారీ గాలులకు చెల్లాచెదురుగా ఎగిరిపోయాయి. ప్రాణనష్టంపై స్పష్టమైన సమాచారం లేదని అధికారులు తెలిపారు. శుక్రవారం కూడా తుపాను చెలరేగే ప్రమాదముందని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.