తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఎండ సెగ: చెక్​లో స్పింకర్లతో పర్యటకులపై జల్లులు - యాత్రికులకు చిరుజల్లుల ఉపశమనం

By

Published : Jun 26, 2019, 7:17 AM IST

చెక్ రిపబ్లిక్​ రాజధాని ప్రాగ్​​లో పర్యటకులకు భారీ ఉష్ణోగ్రతల నుంచి కాస్త ఉపశమనం కలిగించింది అక్కడి యంత్రాంగం. దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా స్ప్రింక్లర్​ ట్రక్కుతో ఓల్డ్​​ టౌన్​ స్క్వేర్​లో నీటిని వెదజల్లించింది. వేడి తీవ్రతతో ఇబ్పంది పడుతున్న పర్యటకులు, నగరవాసులు జల్లులను ఆస్వాదించారు. సాధారణంగా వేడి ఎక్కువగా ఉండే రోజుల్లో నగరమంతా ట్రక్కులతో నీటిని వెదజల్లిస్తుంది అక్కడి యంత్రాంగం. బుధవారం అత్యధికంగా 34 డిగ్రీల సెల్సీయస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవచ్చని అంచనా వేసింది. ఉత్తరాఫ్రికా నుంచి ఐరోపా వైపు వేడిగాలులు వీస్తుండటం వల్ల చెక్​లో ఉష్టోగ్రతలు పెరుగుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details