Tornado in America: టోర్నడో విధ్వంసం- కళ్లకు కట్టిన డ్రోన్ వీడియోలు - amazon warehouse accident
Tornado in America: అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రజలు వణికిపోతున్నారు. దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గల్లంతయ్యారు. కెంటకీ రాష్ట్రం అత్యంత ప్రభావితమైంది. సుడిగాలులకు తోడు భారీ వర్షాలతో ఇళ్లు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకూలాయి. డ్రోన్ దృశ్యాలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. మేఫీల్డ్ పట్టణమంతా టోర్నడోతో నేలమట్టమైంది. కార్యాలయాలు, అపార్ట్మెంట్ భవనాలు కుప్పకూలాయి. ఇలినాయిస్లోని అమెజాన్ వేర్హౌస్ కూడా బాగా దెబ్బతింది. ఈ పరిస్థితులపై సమీక్షించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కెంటకీలో ఎమర్జెన్సీ ప్రకటించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.