స్పెయిన్ వీధుల్లో వేలాది బైక్‌లపై శాంటాల రయ్ రయ్! - 2018లో 7 వేల మంది ఔత్సాహికులు పాల్గొన్నా
స్పెయిన్‌లోని బార్సీలోనా క్రిస్మస్ వేడుకల్లో భాగంగా శాంటా క్లాజ్ దుస్తులతో వేలాది మంది ఔత్సాహికులు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలను 2013 నుంచి నిర్వహిస్తున్నారు. రికార్డు స్థాయిలో 2018లో 7 వేల మంది ఔత్సాహికులు ఇందులో పాల్గొన్నారు. వీరు దారిలో చూపరుల నుంచి బహుమతులను అందుకుంటారు. ఈ బహుమతులను రెడ్ క్రాస్ సంస్థ ద్వారా అనారోగ్యంతో బాధపడే చిన్నారులకు దానం చేస్తారు.