చలికి తాబేళ్లు గజగజ- సంరక్షణ కేంద్రానికి తరలింపు
అమెరికాలో కొద్దిరోజులుగా పడుతున్న హిమపాతానికి మనుషులు, జంతువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారడానికి ఈ వీడియోనే నిదర్శనం. తీవ్ర చలికి టెక్సాస్లోని సముద్ర తీరంలో తాబేళ్ల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. దాంతో అక్కడ వేల సంఖ్యలో ఉన్న తాబేళ్లను దక్షిణ పాడ్రే ద్వీపంలో ఉన్న సంరక్షణ కేంద్రానికి తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 3,500 వరకు పైగా తాబేళ్లను రక్షించారు. ఉష్ణోగ్రత బాగా పడిపోతే తాబేళ్లు కదలడం, నీళ్లలో ఈదడం చేయలేవు. ఊపిరి కూడా తీసుకోలేవు.