Afghanistan: కాబుల్ విమానాశ్రయం ఎదుట దయనీయ పరిస్థితి - అఫ్గానిస్థాన్ తాలిబన్లు
అఫ్గానిస్థాన్(Afghanistan) కాబుల్ విమానాశ్రయంలో దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాలిబన్(Taliban) చెర నుంచి బయట పడేందుకు పెద్దఎత్తున ప్రజలు విమానాశ్రయానికి తరలివస్తున్నారు. వారిలో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. ఎలాగైనా దేశం విడిచి వెళ్లాలని.. రాత్రింబవళ్లు లెక్కచేయకుండా విమానాశ్రయం ఎదుటే పడిగాపులు కాస్తున్నారు. ఆహారం, తాగేందుకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. అమెరికా బలగాలు వారికి సాయంగా నిలుస్తున్నాయి. ధ్రువపత్రాలు సరిగా ఉన్నవారిని ఒక్కొక్కరిగా లోపలికి పంపుతోంది సైన్యం.