కరోనాపై పోరుకు ఈఫిల్ టవర్ వెలుగుల సందేశం - కరోనా
కరోనా కట్టడికి ముందుండి కృషి చేస్తున్న వారికి సంఘీభావంగా ఫ్రాన్స్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమం నిర్వహించింది. ప్రఖ్యాత ఈఫిల్ టవర్‌ను విద్యుత్తు దీపాలతో అలంకరించి.. ఆంగ్లం, ఫ్రెంచ్ భాషల్లో 'కృతజ్ఞతలు' తెలిపింది. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని కోరుతూ.. 'స్టే ఎట్ హోమ్' సందేశం అందించింది. ఫ్రాన్స్‌లో కరోనాకు ఇప్పటివరకు 1700 మంది వరకు బలయ్యారు. వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఏప్రిల్ 15 వరకు కఠిన ఆంక్షలు విధించింది ప్రభుత్వం.