పోలాండ్లో అగ్ని ప్రమాదం- భారీగా చెలరేగిన మంటలు - వార్సా
పోలాండ్ రాజధాని వార్సాలో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. నిర్మాణ దశలో ఉన్న ఓ భవనంలో మంటలు చెలరేగాయి. 430 అడుగుల ఎత్తులో ఉన్న అంతస్తులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మంటలను అదుపు చేసేందుకు 120 అగ్నిమాపక యంత్రాలతో వందల మంది సిబ్బంది ఎంతో శ్రమించారు. భవనం పైఅంతస్తుకు వెళ్లేందుకు మెట్లు లేకపోవం వల్ల సిబ్బంది నిచ్చెనలతోనే పైకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.