ఇరాక్: కళాశాలలు వీడి రోడ్లపైకి విద్యార్థులు - ఇరాక్ నిరసనలు
ఇరాక్‌లోని విద్యార్థులు నిరసన బాట పట్టారు. కళాశాలలను వీడి... ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొన్నారు. దేశంలో నెలకొన్న అవీనితి, నిరుద్యోగం వంటి సమస్యలకు బాధ్యత వహించి ప్రభుత్వంలోని నేతలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెల్లదుస్తులు, మాస్కులు ధరించి శాంతియుతంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరాక్‌లో గత నెల రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన హింసాత్మక ఘటనల్లో దాదాపు 250మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.